Advertisement
Advertisement
Abn logo
Advertisement

కసింకోట పసికందు అనుమానాస్పద మృతి కేసులో వీడిన చిక్కుముడి

విశాఖ: అనకాపల్లి కసింకోట పసికందు అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడి వీడింది. పసికందు తల్లి సంధ్యను పోలీసులు హంతకురాలిగా నిర్ధారించారు. తన మతిస్థిమితం బాగోలేదని, ఎందుకు చంపోనో... తనకే తెలియదని సంధ్య పోలీసులకు వివరణ ఇచ్చింది. సంధ్య, అప్పలరాజు కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలకు 34 రోజుల బాబును తీసుకెళ్లి వరండాలో ఉన్న డ్రమ్ములో సంధ్య ముంచేసింది. అనంతరం తనకేమీ తెలియనట్లు బాబు కనిపించట్లేదని నాటకమాడింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిజానిజాలు వెల్లడించింది. 

Advertisement
Advertisement