‘ముస్కాన్‌’ను విజయవంతం చేయాలి : ఏఎస్పీ

ABN , First Publish Date - 2022-06-30T05:44:11+05:30 IST

‘ముస్కాన్‌’ను విజయవంతం చేయాలి : ఏఎస్పీ

‘ముస్కాన్‌’ను విజయవంతం చేయాలి : ఏఎస్పీ

కృష్ణకాలనీ, జూన్‌ 29: ఆపరేషన్‌ ముస్కాన్‌-8ను విజయవంతం చేయాలని జిల్లా అదనప ఎస్పీ వి.శ్రీనివాసులు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాల యంలో వివిధశాఖల అధికారులతో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరే షన్‌ ముస్కాన్‌ను నిర్వహించాలన్నారు. బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని, వీధి బాలలు, బాల కార్మికఛులు, బిక్షాటనలో ఉన్న చిన్నారులు, మానవ అక్రమ రవాణాకు గురైన చిన్నారులను కనిపెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంతకు ముందు ముస్కాన్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. సామ్యూల్‌, బాలల సమితి చైర్‌ పర్సన్‌ అనిల్‌చందర్‌రావు, సభ్యులు సుధాకర్‌, దామోదర్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ పెద్దన్న కుమార్‌, బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, రాజకొమురయ్య, వెంకటస్వామి, లీగల్‌ ఆఫీసర్‌ మోహినోద్దీన్‌, సఖి సెంటర్‌ అడ్మిన్‌ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:44:11+05:30 IST