మూసీకి పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2021-08-29T01:47:02+05:30 IST

హైదరాబాద్‌లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను అధికారులు

మూసీకి పోటెత్తిన వరద

సూర్యాపేట: హైదరాబాద్‌లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను అధికారులు శనివారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇది రెండోమారు. 645అడుగుల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న మూసీ శుక్రవారం రాత్రి 643అడుగులకు చేరింది. వరద మరింత పెరగడంతో శనివారం మధ్యాహ్నానికి 643.50అడుగులుకు చేరగా, ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 3,850క్యూసెక్కులకు పెరిగింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు శనివారం మధ్యాహ్నం ప్రాజెక్టుకు చెందిన 2, 4, 11నెంబర్‌ క్రస్టుగేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 4,158క్యూసెక్కుల నీటిని దిగువ విడుదలచేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా మరో 189క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2021-08-29T01:47:02+05:30 IST