మండలిలో వీగిన పురపాలక సవరణ బిల్లు

ABN , First Publish Date - 2020-12-03T08:48:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాసనం (రెండవ సవరణ బిల్లు) బుధవారం శాసన మండలిలో వీగిపోయింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

మండలిలో వీగిన పురపాలక సవరణ బిల్లు

అమరావతి డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాసనం (రెండవ సవరణ బిల్లు) బుధవారం శాసన మండలిలో వీగిపోయింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే టీడీపీ, పీడీఎఫ్‌ ఈ బిల్లు ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందంటూ తిరస్కరించాయి. టీడీపీ సభ్యులు బిల్లుపై డివిజన్‌ పెట్టాలని కోరారు. బిల్లుపై సభలో ఓటింగ్‌ జరిగింది. సభలో 29 మంది సభ్యులు బిల్లును తిరస్కరించగా... 11 మంది సమర్థించారు. ఇద్దరు తటస్థంగా ఉన్నారు. మోజార్జీ సభ్యులు బిల్లును తిరస్కరించడంతో బిల్లు వీగిపోయింది. టీడీపీ మండలిపక్షనేత యనమల రామకృష్ణుడు బిల్లును తిరస్కరించడానికి కారణాన్ని వివరించారు. ప్రతిగా మంత్రి బొత్స... పారదర్శకత కోసం, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే విధానం అమలు చేయాలనే బిల్లు తెచ్చామన్నారు. 


మండలి ఆమోదించిన బిల్లులు ఇవే..: గేమింగ్‌ యాక్ట్‌, చేప పిల్లల పెంపకం (నాణ్యత నియంత్రణ) సవరణ బిల్లు, మత్స్య విశ్వవిద్యాలయం బిల్లు, చేపల మేత (నాణ్యత నియంత్రణ ) బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. వీటిని వరుసగా మంత్రులు మేకతోటి సుచరిత, సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టారు.

Updated Date - 2020-12-03T08:48:54+05:30 IST