Abn logo
Sep 16 2020 @ 04:42AM

3.75 కోట్ల హవాలా సొమ్ము పట్టివేత

ముంబై కేంద్రంగా భారీ దందా

గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ముంబై కేంద్రంగా కొనసాగుతున్న హవాలా రాకెట్‌ గుట్టును హైదరాబాద్‌ పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన కమలేశ్‌ షా.. ముంబై కేంద్రంగా పి.విజయ్‌ అండ్‌ కంపెనీ పేరుతో హవాలా దందా సాగిస్తున్నాడు. అతడు తన సామ్రాజ్యాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, రోడ్‌ నెంబర్‌-12కు కూడా విస్తరించాడు. ఇక్కడి కార్యాలయ బాధ్యతలను దినేశ్‌, గిరికి అప్పగించాడు. ఇదే కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌లుగా గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌కు చెందిన ఆర్డీవో, డీటీపై క్రిమినల్‌ కేసులువిశ్రాంత వీఆర్వో, నలుగురు మాజీ సైనికులపై కూడా.. రికార్డులు తారుమారు, ఫోర్జరీ సంతకాల అభియోగాలు అజిత్‌సింగ్‌.ఆర్‌.దోడియా, సోమ్‌నాథ్‌కు చెందిన రాథోడ్‌ కనక్‌సింగ్‌ నాతూభా, కుక్‌గా ఠాకోర్‌ సోల్‌బెన్‌ పనిచేస్తున్నారు. హైదరాబాద్‌-ముంబై-గుజరాత్‌ మధ్య ఈ కార్యాలయం ద్వారా హవాలా దందా కొనసాగిస్తున్నారు.


ఈ కంపెనీలో కారుడ్రైవర్లుగా పని చేస్తున్న గుజరాత్‌లోని పటాన్‌ జిల్లా, ఛానాసానా ప్రాంతానికి చెందిన ఈశ్వర్‌ దిలీ్‌పజీ సోలంకి, హరీశ్‌ రామ్‌భాయ్‌ పటేల్‌లు సోమవారం ముంబై నుంచి నగరానికి వచ్చారు. మంగళవారం ఉదయం దినేశ్‌, గిరి నుంచి రూ.3.75కోట్లు తీసుకుని.. రెండు కార్లలో ముంబై బయలుదేరారు. ఉప్పందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 వద్ద తనిఖీ చేపట్టి, డబ్బులు తరలిస్తున్న కార్లను అడ్డుకున్నారు. ఈశ్వర్‌ దిలీ్‌పజీ సోలంకి, హరీశ్‌రామ్‌, అజిత్‌సింగ్‌, రాథోడ్‌ కనక్‌సింగ్‌లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.3.75కోట్ల నగదు, రెండు కార్లను సీజ్‌ చేశారు. నిందితులను, సీజ్‌ చేసిన డబ్బును తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు అంజనీకుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement