ఐపీఎల్ మీడియా హక్కుల రేసులో ‘బిగ్ బ్రాండ్స్’

ABN , First Publish Date - 2022-04-05T22:38:16+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల కోసం పెద్ద కంపెనీలు బరిలోకి దిగుతున్నాయి. 2023-27

ఐపీఎల్ మీడియా హక్కుల రేసులో ‘బిగ్ బ్రాండ్స్’

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల కోసం పెద్ద కంపెనీలు బరిలోకి దిగుతున్నాయి. 2023-27 కాలానికి గాను మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇటీవల ఇన్విటేషన్ టు టెండర్ (ఐఐటీ) జారీ చేసింది. బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన వెంటనే బండా కంపెనీలు రంగంలోకి దిగిపోయాయి. సోనీ, డిస్నీ, టీవీ18-వీడియోకాన్, జీ, అమెజాన్ వంటి కంపెనీలు హక్కులను దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. 


ఇవే కాదు, మరిన్ని కంపెనీలు కూడా హక్కుల కొనుగోలుకు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం జూన్ 12 ఈ-వేలం నిర్వహిస్తారు. ఐటీటీ పొందేందుకు మే 10 చివరి గడువు. ఐటీ వేలం ద్వారా బీసీసీఐకి రూ. 7.2 బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా. పై పేర్కొన్న కంపెనీలతోపాటు అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కూడా హక్కుల కోసం ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. హక్కుల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 

 

మీడియా హక్కులు నాలుగు ప్యాకేజీలుగా ఉంటాయి. అందులో మొదటిది భారత ఉపఖండం టెలివిజన్ హక్కులు కాగా, రెండోది డిజిటల్ హక్కులు, మూడోది 18 మ్యాచ్‌లు (ప్రారంభ మ్యాచ్, ప్లేఆఫ్స్ గేమ్స్, వారాంతాల్లో జరిగే రెండు మ్యాచ్‌లు, ఈవినింగ్స్ గేమ్స్‌) కాగా, చివరిది మిగతా ప్రపంచానికి సంబంధించి హక్కులుగా విభజించారు. వేలం రెండు రోజులపాటు జరుగుతుంది. తొలి రోజు తొలి రెండు కేటగిరీలకు నిర్వహిస్తారు. రెండో రోజు మిగిలిన రెండు ప్యాకేజీలకు వేలం నిర్వహిస్తారు. 

Updated Date - 2022-04-05T22:38:16+05:30 IST