ఎకరాకు రూ.35 వేల రుణం

ABN , First Publish Date - 2021-06-06T06:00:59+05:30 IST

ఎకరాకు రూ.35 వేల రుణం

ఎకరాకు రూ.35 వేల రుణం
అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి

మొత్తం రూ. 110 కోట్ల పంపిణీ


ముల్కనూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు ఎ.ప్రవీణ్‌రెడ్డి


భీమదేవరపల్లి, జూన్‌ 5: ముల్కనూర్‌ సహకార బ్యాంకు సభ్యులకు ఈ ఖరీ్‌ఫలో రూ. 110కోట్ల రు ణాలను పంపిణీ చేయనున్నట్లు ముల్కనూర్‌ సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ముల్కనూర్‌ సహకార బ్యాంకులో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ... ఈ నెల 7నుంచి ముల్కనూర్‌ బ్యాంకులో రుణాలను పంపిణీ చే యనున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ. 35వేల చొప్పున 6,500మంది సభ్యులకు వారి వ్యవసాయ భూములను బట్టి రుణాలను అందిస్తామన్నారు. 2861 ట న్నుల యూరియా, 454టన్నుల డీఏపీ, 1946టన్నుల కాంప్లెక్స్‌, 170టన్నుల పోటా్‌షలు రూ. 5.5కోట్ల విలువ చేసే ఎరువులను బ్యాంకు గోదాముల్లో ఖరీఫ్‌ సీజన్‌ కోసం నిల్వ చేశామన్నారు. రైతులకు అవసరం ఉన్న మేరకు ఎరువుల ను ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. గత సంవత్సరం రబీలో ఇచ్చిన వ్యవసా య రుణాలు దాదాపు 98శాతం రికవరీ అయ్యాయని వివరించారు. రైతులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని కోరారు. వీటితో పాటు రై తులకు అవసరమ య్యే ట్రాక్టర్‌, హార్వేస్టర్‌, పైపులైన్లు, పౌలీ్ట్ర, డెయిరీ లాంటి మధ్యకారిక అప్పులను రైతులకు అందిస్తామన్నారు. ఈ నెల 7నుంచి రైతులు తాము రుణం చెల్లించిన విధంగా అప్పులను తిరిగి ఇచ్చేందుకు తేదీలను ప్రకటించామన్నారు. ఆ తేదీల వారీగా రైతులు వచ్చి రుణాలను పొందాలని సూ చించారు. బ్యాంకు జీఎం మార్పాటి రాంరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-06T06:00:59+05:30 IST