ఏపీ రాజధాని విషయంలో పకడ్బందీ తీర్పు వచ్చింది: రఘురామ

ABN , First Publish Date - 2022-03-04T20:29:10+05:30 IST

ఏపీ రాజధాని అంశంలో పకడ్బందీ జడ్జిమెంట్ వచ్చిందన ఎంపీ రఘురామ క`ష్ణం రాజు పేర్కొన్నారు. ఏపీలో దళితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు

ఏపీ రాజధాని విషయంలో పకడ్బందీ తీర్పు వచ్చింది: రఘురామ

అమరావతి: ఏపీ రాజధాని అంశంలో పకడ్బందీ జడ్జిమెంట్ వచ్చిందన ఎంపీ రఘురామ క`ష్ణం రాజు పేర్కొన్నారు. ఏపీలో దళితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని,పార్లమెంట్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.హైకోర్టు తీర్పుపై హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు సరైన విధంగా లేవని రఘురామ ఆరోపించారు.ఇక రాజధాని విషయం పై సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేదని,ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కోర్టు చెంప దెబ్బలు వేస్తోందని ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో జగన్‌ నిర్ణయం దారుణంగా వుందని రఘురామరాజు ఆరోపించారు.సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.అసెంబ్లీ రద్దు చేసి జగన్ ఎన్నికలకు వెళ్లాలి.


తనను కొందరు రాష్ట్రానికి రానివ్వడం లేదని ఆయన ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై లేఖలు రాస్తున్నానని అన్నారు. తన పార్టీ సభ్యులు నాపై అనర్హత వేటు వేయిస్తా అంటేనే ఛాలెంజ్ చేశానని చెప్పారు.ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రకటిస్తే ప్రభుత్వం రద్దవుతుందని రఘురామరాజు ఆరోపించారు.సీబీఐ నోటీసులు ఇస్తే అవినాష్ రెడ్డి తీసుకుంటారు.సీఐడీ అంత కక్ష్య పూరీతంగా వ్యవహరించదని అన్నారు.


Updated Date - 2022-03-04T20:29:10+05:30 IST