నా పోరాటం శివసేన పైనే...: ఎంపీ నవనీత్ కౌర్
ABN , First Publish Date - 2021-06-25T16:12:51+05:30 IST
దేశంలోనే అతి పిన్న వయసులో ఎంపీగా విజయం సాధించానని నవనీత్ కౌర్ అన్నారు.
తిరుమల: దేశంలోనే అతి పిన్న వయసులో ఎంపీగా విజయం సాధించానని పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ అన్నారు. శుక్రవారం తిరుమలకు వచ్చిన ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటమి అక్కసుతోనే శివసేన అభ్యర్థి తనపై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. హైకోర్టులో తనకు చుక్కెదురైనా, సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందన్నారు. తన పోరాటం శివసేన పైనేనని, తన ప్రధాన ప్రత్యర్థి శివసేనన్నారు. తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానన్నారు. ప్రధానంగా ఏపీ రైతుల తరుపున లోకసభలో తన గలం వినిపిస్తానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల తర్వాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కరంపైనే దృష్టి పెడతానని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.