విజయవాడ: కోవిడ్ సమయంలో డాక్టర్లు(Doctors) ప్రజలకు ఎంతో సేవలందించారని ఎంపీ కేశినేని నాని(Kesineni nani) అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే(National doctors day) సందర్భంగా డాక్టర్లను ఎంపీ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంతో మంది డాక్టర్లు కొవిడ్‌లో సేవలందించినప్పటికీ... కొంతమంది డాక్టర్లు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ‘‘పేద వారికి ఫ్రీ ట్రీట్మెంట్ అడిగాను అని కొంతమంది ప్రైవేట్ డాక్టర్లు కోవిడ్ టైంలో నా ఫోన్ కూడా ఎత్తలేదు. వైద్యం కోసం నా దగ్గరకు వచ్చిన వాళ్లను తెలిసిన డాక్టర్ వద్దకు పంపిస్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్‌లు అంటూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజారు. 70 శాతం మంచి డాక్టర్లు ఉంటే మిగత 30 శాతం డబ్బు ఆశించే డాక్టర్లు ఉన్నారు. వారివల్ల మంచి డాక్టర్లు కూడా చెడ్డపేరు వస్తుంది’’ అని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ చింతమనేని సురేష్(Chintamaneni suresh) నిస్వార్థ సేవలను ప్రజలకు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతమనేని సురేష్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును ఎంపీ కేశినేని అందజేశారు.
ఇవి కూడా చదవండి