ఢిల్లీ: ఏపీలో ఆర్ధిక అరాచకత్వం ఏర్పడిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. ఈ అంశంపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. పదేళ్లలో విభజన హామీలను అమలు చేయాలని కోరారు. ఎనిమిదేళ్లు గడిచినా విభజన హామీలను పట్టించుకోవడం లేదని చెప్పారు. పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఎఫ్ఆర్‌బీఎంకు మించి ఏపీ రుణాలను సేకరిస్తుందన్నారు. ఏపీలో ఆర్ధిక క్రమశిక్షణ లేదు...కేంద్రం జోక్యం చేసుకోకపోతే ఏపీ అధ:పాతాళానికి వెళ్తుందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి