హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద రాజ్యసభ ఏపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాజకీయ విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ పాలన చూపిన వ్యక్తి అని తెలిపారు. ఎన్టీఆర్ సామాజిక శక్తి... రాజకీయంగా అనేకమందికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టిన వ్యక్తి అని చెప్పారు. ఆయన విగ్రహానికి నమస్కరించి.. పార్లమెంట్‌కు వెళ్తుంటానని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి