Abn logo
Oct 14 2021 @ 16:36PM

ఆరేళ్ల కుమార్తెతో సహా భార్య మరణించిన రోజు.. గూగుల్‌, యూట్యూబ్‌‌లో ఆ భర్త ఏం చూశాడా అని పోలీసులు చెక్ చేస్తే..

గుజరాత్‌లోని వడోదర నగరంలోని న్యూసామ ప్రాంతంలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసు.. సంచలనం సృష్టించింది. ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే చివరకు వారి చావుకు గల కారణాలు తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. మహిళ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌ను తనిఖీ చేయగా.. పలు సంచలన విషయాలు బయటపడ్డాయి.. వివరాల్లోకి వెళితే..

వడోదర న్యూసామా ప్రాంతంలో తేజస్ పటేల్, శోభనాబెన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2012లో వివాహమైంది. కావ్య అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. యూనికార్న్ సర్కిల్ సమీపంలో ఉన్న క్రోమా స్టోర్‌లో తేజస్ పటేల్.. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తేజస్‌కు మరో మహిళతో పరిచయం ఏర్పడింది. రానురాను వారి పరిచయం కాస్త.. వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లకు ఈ విషయం తేజస్ భార్యకు తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మరింత ఎక్కువవడంతో.. తేజస్ ఓ నిర్ణయానికి వచ్చాడు.

 తన భార్య, కుమార్తెను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. మొత్తానికి మూడో కంటికి తెలియకుండా భార్యాబిడ్డలను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కూతురిని చంపి భార్య తనను తాను ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు. అయితే అతడి ప్రవర్తనపై బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అంతా ఆరా తీసినా ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి ఫోన్‌ను పరిశీలించిన తర్వాత అసలు నిజం తెలిసింది. ‘విషం ఎలా పనిచేస్తుంది. మనుషులను ఎలా చంపాలి. ఈజీగా చంపడం ఎలా..?’ తదితర అంశాలను అతడు యూట్యూబ్, గూగుల్‌లో సెర్చ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

గూగుల్‌లో అతడి సెర్చ్ హిస్టరీని పరిశీలించిన తర్వాత నేరం అతడే చేశాడన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై నాలుగవ పోలీస్ జోన్ డిప్యూటీ కమిషనర్ లఖ్‌ధీర్ సింగ్ మాట్లాడుతూ భార్య, కుమార్తెను ఎలా చంపాలనే విషయంపై నిందితుడు రెండు నెలల పాటు గూగుల్-యూట్యూబ్‌లో శోధించినట్లు చెప్పారు. ప్రస్తుతం తేజస్‌ను రిమాండ్‌కు తరలించామని, ఈ కేసుపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...