Abn logo
Sep 18 2021 @ 02:17AM

విభేదాల సమయంలోనే ఎక్కువ ట్రోఫీలు

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ చరిత్రలో లియాండర్‌ పేస్‌-మహేశ్‌ భూపతి జోడీ సాధించిన ఘనతలు చిరస్మరణీయం. 1999లో వింబుల్డన్‌ రూపంలో భారత్‌కు తొలి గ్రాండ్‌స్లామ్‌ అందించారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌గా పిలుచుకున్న ఈ ద్వయం 1994-2006, 2008-2011 మధ్య డబుల్స్‌లో ఆడింది. అలాగే వీరి మధ్య విభేదాలు కూడా అప్పట్లో చర్చనీయాంశంగానే ఉండేది. ఇప్పుడు ‘బ్రేక్‌ పాయింట్‌’ అనే వెబ్‌ సిరీస్‌ కోసం ఈ ఇద్దరూ తమ అనుభవాలను పంచుకున్నారు. భూపతి చాలా తక్కువగా మాట్లాడతాడని, తమ ఇద్దరి వ్యక్తిత్వాలు పూర్తి భిన్నంగా ఉంటాయని పేస్‌ తెలిపాడు. అలాగే తమ మధ్య అంతగా సఖ్యత లేనప్పుడే ఎక్కువ ట్రోఫీలు సాధించామని వెల్లడించాడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు విభేదాలు మరిచి విజయమే లక్ష్యంగా ఆడామని తెలిపాడు.