12 లక్షలు ఖర్చయినా ప్రాణం దక్కలే

ABN , First Publish Date - 2020-08-02T08:34:46+05:30 IST

పాము కాటుతో ఆస్పత్రిలో చేరి, నెలరోజుల పాటు చికిత్స పొంది, సుమారు రూ.12 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కకపోవడం ఆ కుటుంబాన్ని విషాదంలో

12 లక్షలు ఖర్చయినా ప్రాణం దక్కలే

  • పాముకాటుతో ఆస్పత్రిలో చేరి నెల రోజుల చికిత్స

సంగారెడ్డి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పాము కాటుతో ఆస్పత్రిలో చేరి, నెలరోజుల పాటు చికిత్స పొంది, సుమారు రూ.12 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కకపోవడం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. చివరకు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారంటూ ఆస్పత్రి పేర్కొనడం మరింత కలిచివేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం కాకిజన్‌వాడకు చెందిన మహిళ(40)ను  జూన్‌ 29న పాము కాటు వేసింది. మూగవైద్యం చేయించుకున్నా.. పరిస్థితి కుదుటపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకొచ్చారు. చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడంతో హైదరాబాద్‌ తీసుకువెళ్లారు. రెండు మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులు తిరిగిన వారు చివరకు సూరారంలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. నెల రోజులుగా చికిత్స అందిస్తున్న వైద్యులు కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయంటూ డయాలసిస్‌ చేశారు. వారం కిందట కరోనా పాజిటివ్‌ అని చెప్పిన వైద్యులు.. శనివారం ఆమె మరణించిందని తెలిపారు. 

Updated Date - 2020-08-02T08:34:46+05:30 IST