మోల్నుపిరవిర్‌ విక్రయం కోసం

ABN , First Publish Date - 2022-01-21T08:23:58+05:30 IST

మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను తయారు చేసి విక్రయించడానికి మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో నాట్కో ఫార్మా నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా దేశీయంగా 200 ఎంజీ మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను ‘మోల్నునాట్‌’ ..

మోల్నుపిరవిర్‌ విక్రయం కోసం

ఎంపీపీతో నాట్కో ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను తయారు చేసి విక్రయించడానికి మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో నాట్కో ఫార్మా నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా దేశీయంగా 200 ఎంజీ మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను ‘మోల్నునాట్‌’ బ్రాండ్‌తో విక్రయించడంతో పాటు 105 దేశాలకు ఎగుమతి చేస్తుంది. కొవిడ్‌ చికిత్సకు మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని వినియోగించడానికి అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మోల్నుపిరవిర్‌ లైసెన్స్‌ను మెర్క్‌ షార్ప్‌ అండ్‌ డోమ్‌ (ఎంఎస్‌ డీ) నుంచి ఎంపీపీ తీసుకుంది. నాట్కో మోల్నుపిరవిర్‌ విక్రయాలపై ఎంఎ్‌సడీకి రాయల్టీ చెల్లిస్తారు. కొవిడ్‌ మమమ్మారి కొనసాగినంత వరకూ నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందం కొనసాగుతుందని నాట్కో వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్‌ ధరను నాట్కో నిర్ణయిస్తుంది. 


బయోఫోర్‌ కూడా: మోల్నుపిరవిర్‌ ఏపీఐ, క్యాప్సుల్స్‌ తయారీకి హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్‌ ఇండియా ఫార్మా.. ఎంఎ్‌సడీ తరఫున ఎంపీపీతో ఒప్పందం కుదుర్చుకుంది. వారం రోజుల్లో మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ను దేశీయం గా విక్రయించడమే కాక 104 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు బయోఫోర్‌ సీఈఓ జగదీశ్‌ బాబు తెలిపారు.  

Updated Date - 2022-01-21T08:23:58+05:30 IST