ఈతరం బ్యాట్స్‌మెన్లలో.. అతన్ని ఔట్ చేయడం కష్టం: మహ్మద్ అమీర్

ABN , First Publish Date - 2020-05-26T21:33:45+05:30 IST

ఈతరంలో ఎంతో మంది గొప్ప బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జో రూట్, కేన్ విలియమ్‌సన్ ఇలా చెప్పుకుంటూ పోతే.. బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఎందరో

ఈతరం బ్యాట్స్‌మెన్లలో.. అతన్ని ఔట్ చేయడం కష్టం: మహ్మద్ అమీర్

ఈతరంలో ఎంతో మంది గొప్ప బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జో రూట్, కేన్ విలియమ్‌సన్ ఇలా చెప్పుకుంటూ పోతే.. బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఎందరో ఆటగాళ్లు ఉన్నారు. కానీ, పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ మాత్రం అత్యంత కఠినమైన బ్యాట్స్‌మెన్‌ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అని అంటున్నాడు. అతన్ని ఔట్ చేయడం చాలా కష్టమని అతను అన్నాడు.


ఎవరిని ఔట్ చేయడం చాలా కష్టం.. అని అతన్ని ప్రశ్నించగా.. ‘‘గతంలో అయితే జోనాథన్ ట్రోట్.. ప్రస్తుత బ్యాట్స్‌మెన్లలో స్టీవ్ స్మిత్.. అతని పటిష్టమైన టెక్నిక్ కారణంగా అతన్ని ఔట్ చేయడం కష్టం’’ అని అమీర్ సమాధానం ఇచ్చాడు. 

Updated Date - 2020-05-26T21:33:45+05:30 IST