Abn logo
Mar 4 2021 @ 00:13AM

మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా పనిచేయాలి

ములుగు ఆర్డీవో రమాదేవి 

ములుగు కలెక్టరేట్‌, మార్చి 3: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్ర మత్తంగా పనిచేయాలని, ఎన్నికల నియ మావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆర్డీవో, జిల్లా ఎన్నికల సహాయ అధికారి కె.రమాదేవి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫ రెన్స్‌హాల్‌లో 21మంది మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్‌ ట్రెయినర్ల ద్వారా శిక్షణ ఇప్పించారు. జిల్లా వ్యాప్తంగా 15పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మైక్రో అబ్జర్వర్లుగా నియ మించబడ్డ అధికారులు పోలింగ్‌ సిబ్బంది, ఏ జెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో కెమెరాలు ఏర్పాటుచేసి చిత్రీకరణ జరిపించాలన్నారు. పోలింగ్‌కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి రాజకీయపార్టీల బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించకుండా, ప్రచారం చేయకుండా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రసూనరాణి, తహసీల్దార్‌ సత్యనా రాయణస్వామి, మాస్టర్‌ ట్రెయినర్లు సతీష్‌కుమార్‌, శ్రీనివాసరెడ్డి, భాస్కర్‌, కిషోర్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement