కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదు: ఎమ్మెల్సీ పల్లా

ABN , First Publish Date - 2022-05-24T00:57:10+05:30 IST

కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదు: ఎమ్మెల్సీ పల్లా

కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదు: ఎమ్మెల్సీ పల్లా

హైదరాబాద్: అన్ని వర్గాల నాయకులకు కేసీఆర్ అవకాశం ఇస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాజ్యాన్ని ఏలాలని కొంతమంది భావిస్తున్నారని చెప్పారు. కులం, మతం ఎత్తుకొని సమాజంలో చీడపురుగుల్లాగా ఉన్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ను వేలానికి పెట్టారని ఆరోపించారు. కులాల, మతాల మధ్య రేవంత్ రెడ్డి చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తేనే గెలుపు ఉంటుందని, కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం రేవంత్ రెడ్డికి తగదన్నారు. టీఆర్ఎస్‌లో కులాలు, మతాల పంచాయితీ లేదన్నారు. 

Updated Date - 2022-05-24T00:57:10+05:30 IST