పోలీసులతో వివాదంపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వివరణ

ABN , First Publish Date - 2022-04-28T23:18:03+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోలీసులతో వివాదంపై

పోలీసులతో వివాదంపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వివరణ

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోలీసులతో వివాదంపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. పోలీసులపై పొరపాటున నోరు జారానని ఆయన పేర్కొన్నారు. నోరుజారిన ఆడియో క్లిప్ లతో మనసులు నొప్పించినందుకు విచారిస్తున్నానన్నారు. పోలీసుల మనసును నొప్పిస్తే అది బాధాకరమని ఆయన పేర్కొన్నారు. పోలీసు సోదరులంతా తన కుటుంబసభ్యులతో సమానమని ఆయన తెలిపారు. ఆడియో క్లిప్ లతో పోలీసులు బాధపడితే తీవ్రంగా విచారిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.  


తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వివాదంపై ఆయన  వివరణ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందని, అక్కడికి ఇద్దరు రౌడీ షీటర్లు వచ్చారని తెలిపారు. ఈ విషయంలో రూరల్, టౌన్ సీఐతో మాట్లాడినట్లు చెప్పారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. అధికారులు అంతా తాండూరు రావాలని కోరుకుంటారని అన్నారు. పోలీసులతో చాలా బాగుంటానని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-28T23:18:03+05:30 IST