పల్లె ప్రగతి గ్రామాల స్వరూపాన్నే మార్చివేసింది:Kadiyam sri hari

ABN , First Publish Date - 2022-05-28T21:53:33+05:30 IST

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి(palle pragati) గ్రామాల స్వరూపాన్ని మార్చి వేసిందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(kadiyam sri hari) అన్నారు.

పల్లె ప్రగతి గ్రామాల స్వరూపాన్నే మార్చివేసింది:Kadiyam sri hari

జనగామ: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి(palle pragati) గ్రామాల స్వరూపాన్ని మార్చి వేసిందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(kadiyam sri hari) అన్నారు. శనివారం జనగామ కలెక్టరేట్ లో జరిగిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయర్ల ద్వారా వేసవిలో త్రాగునీరు అందుబాటులో ఉండటం ప్రగతికి నిదర్శనమన్నారు. గతంలో ఉన్న లోపాలను సవరించుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని అన్నారు. గ్రామ పరిధిలో ఉన్న హై స్కూల్స్ హాస్పిటల్స్ పరిశుభ్రంగా ఉంచాలని ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు.


స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య(tatikonda rajiah) మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడక పోవటం ఉష్ణోగ్రత తీవ్రత కారణంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం కొంత ఆలస్యం అయింది అన్నారు. పాడుపడ్డ బావులను పూడ్చి వేయించాలని బోర్లు కూడా తొలగింప చేయాలని అధికారులకు సూచించారు.జిల్లా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో జవాబుదారీతనాన్ని పెంచుతామని పారదర్శకతను చేపడతామన్నారు. ఉదయం ఆరు గంటలకే చెత్త సేకరణ ఇంటింటికీ జరిగేలా చర్యలు తీసుకుంటామని, తడి పొడి చెత్త ఇంటి వద్దనే జరగాలన్నారు. గ్రామపంచాయతీలోనూ పాఠశాలల్లోనూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు.ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన పరిశుభ్రతను రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.


Updated Date - 2022-05-28T21:53:33+05:30 IST