రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు: సీతక్క

ABN , First Publish Date - 2021-08-16T21:29:50+05:30 IST

రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తెస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు: సీతక్క

హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తెస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ నెల 18న ర్యావిరాలలో జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభా స్థలాన్ని టీవర్కింగ్ ప్రైసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, సీనియర్ వైస్ ప్రైసిడెంట్ వేం నరేందర్‌రెడ్డి,  ముఖ్య నాయకులు మల్‌రె‌డ్డి రంగారెడ్డి, మల్‌రె‌డ్డి రామ్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ మాజీ ఎంపీ రాజయ్య తదితరులు సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ..  కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం దళిత, గిరిజన ఓట్ల కోసం దళిత బంధు తెస్తున్నారన్నారు. దళిత బంధు ఒక్క హుజురాబాద్‌లోనే కాదు రాష్ట్రంమంతటా ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు లాగే బీసీబంధు, గిరిజన బంధు లాంటి పథకాలు తేవాలన్నారు. మద్యం బంద్ చేయకపోతే రాష్ట్రంలో ఎన్ని పథకాలు అమలు చేసినా పేదలకు ప్రయోజనం లేదని సీతక్క పేర్కొన్నారు. 


అనంతరం మహేష్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ దళిత, గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. దళిత బంధు పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు తప్ప వారి ప్రయోజనం కోసం చేస్తున్న పనులేమీ లేవని మహేష్‌కుమార్ గౌడ్ చెప్పారు. ఈ నెల  18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రావిర్యాల గ్రామంలో దళిత, గిరిజన దండోరా సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మనిక్కమ్ ఠాగూర్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. 

Updated Date - 2021-08-16T21:29:50+05:30 IST