Mulugu: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన MLA Seetakka

ABN , First Publish Date - 2022-07-12T23:07:30+05:30 IST

ములుగు (Mulugu) జిల్లా: వరద బాధిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Seetakka) పర్యటించారు.

Mulugu: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన MLA Seetakka

ములుగు (Mulugu) జిల్లా: వరద బాధిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Seetakka) పర్యటించారు. ములుగు జిల్లా, పొదుమూరు సమీపంలో గోదావరి (Godavari) వరద ఉధృతి వల్ల కోతకు గురైన భూములను ఆమె పరిశీలించారు. అలాగే పునరావాస కేంద్రానికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. వారికి పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. సకాలంలో టెండర్లు పిలవకపోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. 


ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరైనా.. టెండర్ల పేరుతో నిర్మాణం నిలిపివేశారని విమర్శించారు. సకాలంలో కరకట్ట నిర్మిస్తే మంగపేట ప్రాంతానికి ఇంత దుస్థితి రాదని ఆమె అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్పందించి త్వరగా కరకట్ట నిర్మాణం చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-12T23:07:30+05:30 IST