మంత్రి జగదీష్.. నన్ను కాంట్రాక్టర్ అనడం బాధాకరం: komati reddy

ABN , First Publish Date - 2022-03-11T19:45:44+05:30 IST

సింగరేణి సంస్థలను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అసెంబ్లీలో మాట్లాడినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

మంత్రి జగదీష్.. నన్ను కాంట్రాక్టర్ అనడం బాధాకరం: komati reddy

హైదరాబాద్: సింగరేణి సంస్థలను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అసెంబ్లీలో మాట్లాడినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కోల్ బ్లాక్ టెండర్ విషయంలో పారదర్శంగా జరగాలని డిమాండ్ చేశానన్నారు. సింగరేణికి ఆదాయ వనరుగా ఉందని అన్నారు. ‘‘మంత్రి జగదీష్.. నన్ను వ్యక్తిగతంగా కాంట్రాక్టర్ అని మాట్లాడ్డం బాధాకరం’’ అని తెలిపారు.  తెలంగాణ కోసం వ్యాపారాలు నష్టపోయిన, మంత్రి పదవి వదులుకున్నామన్నారు.  కమిషన్‌ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణను ఎవరు దోచుకునేది ప్రజలు చూస్తున్నారన్నారు. మూడో సారి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని...దాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందని తెలిపారు. నైని కోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని విమర్శించారు. 2014 ముందు జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత ఇప్పుడు ఎంత  అని నిలదీశారు. ‘‘మా ఆస్తులు దానధర్మాలు చేసి, ఉద్యమంలో ఖర్చు చేశాం...మీ కుట్రలు కుతంత్రాలు బయటపెడ్తాం. నేను ఈ రోజైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నైని కోల్ మైన్ విషయంలో అక్రమాలు జరిగాయి.. అటు బీజేపీని ఇటు కాంగ్రెస్‌ను తిడుతారు.. దొంగ పనులు చేసుకుంటా’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


Updated Date - 2022-03-11T19:45:44+05:30 IST