డోన్‌ను రెవెన్యూ డివిజన్ ఎలా చేస్తారు: ఎమ్మెల్యే కాటసాని

ABN , First Publish Date - 2022-01-29T01:04:52+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కర్నూల్ జిల్లాలో డోన్ రెవిన్యూ డివిజన్‌గా

డోన్‌ను రెవెన్యూ డివిజన్ ఎలా చేస్తారు: ఎమ్మెల్యే కాటసాని

కర్నూలు: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కర్నూల్ జిల్లాలో డోన్ రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించడంపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అభ్యంతర వ్యక్తం చేశారు. బనగానపల్లెను కాదని డోన్‌ను రెవెన్యూ డివిజన్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. బనగానపల్లె నియోజకవర్గంలో 5 మండలాలున్నాయన్నారు. కానీ 3 మండలాలున్న డోన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.  డోన్‌ను రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల బనగానపల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని కాటసాని  తెలిపారు. 



కర్నూల్ జిల్లాలో కొత్తగా నంద్యాలను కేంద్రంగా చేసుకుని నంద్యాల జిల్లాను ఏర్పాటు చేశారు. దీనిలో 6 నియోజకవర్గాలను చేర్చారు. కొత్త జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపారు. 


దీనిలో మూడు  1. నంద్యాల 2. డోన్‌ 3. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లను చేర్చారు. నంద్యాల డివిజన్‌లో 9, డోన్‌లో 8, ఆత్మకూరు డివిజన్‌లో 10 మండలాలు ఉన్నాయి. కర్నూలు డివిజన్‌లోని బేతంచర్ల, డోన్‌, పేయేపల్లి మండలాలను నంద్యాల జిల్లాలో కలిపారు. ఇవి కొత్తగా ఏర్పాటైన డోన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి తెచ్చారు. కర్నూలు డివిజన్‌లోని శ్రీశైలం, ఆత్మకూరు, వెలిగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జె.బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూర్‌ మండలాలను ఆత్మకూరు డివిజన్‌లో కలిపారు. 

Updated Date - 2022-01-29T01:04:52+05:30 IST