అమరావతి: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాణీగారితోటలో తోపుడుబండి నడుపుతూ పాత ఫ్యాన్లు తీసుకుని విసనకర్రలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కృష్ణలంక విద్యుత్ ఉపకేంద్రం వద్ద గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ సిబ్బందికి విసెనకర్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేసేందుకంటే సొంత ప్రయోజనాలకే వైసీపీ పని చేస్తోందని విమర్శలు గుప్పించారు. వైసీపీ మాతృ భాష బూతులు, వృత్తి విధ్వంసమన్నారు. ప్రజల్ని కష్టపడితే జగన్మోహన్ రెడ్డికి రాక్షసానందమని వ్యాఖ్యానించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ తమ నిరసన కొనసాగుతుందని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి