Abn logo
Jan 26 2021 @ 23:32PM

పేదలకు ప్రభుత్వం అండ : చల్లా

ఆత్మకూరు/దామెర, జనవరి 26: పేదలకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆడపడుచులకు అండగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.  ఆత్మకూరు మండలంలో 57 మంది, దామెర మండలంలో 59మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ నేతలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ములేదుకానీ, ముఖ్యమంత్రి విమర్శిస్తారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీవో కిషన్‌, ఆత్మకూరు తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఆత్మకూరు మార్కెట్‌ చైర్మన్‌ కేశవరెడ్డి, దామెర ఇన్‌చార్జీ తహసీల్దార్‌ విశ్వనారాయణ, ఎంపీపీ శంకర్‌, జడ్పీటీసీ కల్పన, ఏఎంసీ చైర్మన్‌ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement