అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముకే్‌షకుమార్ మీనా గురువారం సచివాలయంలో కె.విజయానంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సీఈవోకు అభినందనలు తెలిపారు.