Breaking : క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-06-08T20:24:22+05:30 IST

భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ (Cricketer) మిథాలీరాజ్ (Mithali Raj) క్రికెట్‌కు (Cricket) గుడ్ బై చెప్పేసింది..

Breaking : క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై

హైదరాబాద్/న్యూఢిల్లీ : భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ (Cricketer) మిథాలీరాజ్ (Mithali Raj) క్రికెట్‌కు (Cricket) గుడ్ బై చెప్పేసింది. తాను అన్నిఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా మిథాలీ ప్రకటించింది. మిథాలీ మొత్తం 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ-20లు ఆడింది. 12 టెస్టుల్లో మిథాలీరాజ్‌ 699 పరుగులు చేసింది. ఇక 232 వన్డేల్లో మిథాలీరాజ్‌ 7805 పరుగులు సాధించింది. వన్డేల్లో ఇన్ని పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. 89 టీ-20ల్లో ఈమె 2364 పరుగులు చేసింది.


తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈమె ప్రపంచ మహిళల క్రికెట్‌లో తన సత్తా ఏంటో చూపించింది. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు సాధించింది. అయితే 2017లోనే రిటైర్మెంట్ తీసుకోవాలని మిథాలీ భావించిందని.. మనసు మార్చుకుని కెరీర్‌ను కంటిన్యూ చేసినట్లు ఆమె తల్లి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఇవాళ సాయంత్రం మిథాలీ మీడియా మీట్ నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.



Updated Date - 2022-06-08T20:24:22+05:30 IST