Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాళ్‌ఫ్రెండ్‌తో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ నిశ్చితార్థం

సిడ్నీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సుదీర్ఘకాలంగా ప్రేమిస్తున్న గ్రెటా మాక్‌తో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. కాబోయే భార్యతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఓ బీచ్ పక్కన దిగినట్టుగా ఉన్న ఈ ఫొటోలో గ్రెటా తన నిశ్చితార్థం ఉంగారాన్ని చూపిస్తోంది.


ఈ ఫొటోను షేర్ చేసిన వెంటనే  అభిమానులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తించారు. మార్ష్‌కు ఇది వ్యక్తిగతంగా, వృత్తిగతంతా నిజంగా గుడ్‌న్యూసే. అక్టోబరు 17 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఆసీస్ జట్టులో మార్ష్‌కు చోటు లభించింది. 

Advertisement
Advertisement