ఆమదాలవలస, నవంబరు 21: రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం శ్రీకాకుళం నుంచి ఆమదాలవలసకు స్పీకర్ వెళుతుండగా వంజంగి-లంకాం రోడ్డు జంక్షన్‌లో స్పీకర్ కారును..ఆటో ఢీ కొని బోల్తా పడింది. స్పీకర్ వాహనం రోడ్డుపై నుంచి పొలాల వైపు దూసుకెళ్లి కల్వర్టు సమీపంలో నిలిచిపోయింది.