మైరాజ్‌ రికార్డు స్వర్ణం

ABN , First Publish Date - 2022-07-19T10:07:25+05:30 IST

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌ షూటింగ్‌లో వెటరన్‌ షూటర్‌ మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు.

మైరాజ్‌   రికార్డు స్వర్ణం

చాంగ్వాన్‌ (దక్షిణ కొరియా): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌ షూటింగ్‌లో వెటరన్‌ షూటర్‌ మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల స్కీట్‌ వ్యక్తిగత విభాగంలో  దేశానికి తొలి స్వర్ణ పతకం అందించాడు. 40 షాట్లతో కూడిన ఫైనల్లో 46 ఏళ్ల మైరాజ్‌ 37 పాయింట్లు సాధించాడు. కొరియా షూటర్‌ మిన్సు కిమ్‌ (36), బెన్‌ లెవెల్లిన్‌ (26) తర్వాతి స్థానాల్లో నిలిచారు. 2016లో రియోలో జరిగిన వరల్డ్‌కప్‌లో తను రజతం సాధించడమే ఉత్తమ ప్రదర్శనగా ఉంది. 

Updated Date - 2022-07-19T10:07:25+05:30 IST