ముగిసిన మేడారం జాతర: కోటి 35 లక్షల మంది హాజరు

ABN , First Publish Date - 2022-02-19T22:24:42+05:30 IST

తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే మేడారం గిరిజన జాతర విజయవంతంగా ముగిసిందని జాతరను పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రటించారు.

ముగిసిన మేడారం జాతర: కోటి 35 లక్షల మంది హాజరు


మేడారం: తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే మేడారం గిరిజన జాతర విజయవంతంగా ముగిసిందని జాతర పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రటించారు. ఈ ఏడాది జాతరకు కోటి ముప్పైఐదు లక్షల మంది భక్తులు వచ్చారు. గతంలో ఎన్నడూ లేని రీతిగా జాతర నిర్వహించుకున్నాము. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృజ్ఞాతులు. జాతర ప్రతిష్టత , గౌరవం  పెంచేలా అధికార యంత్రాంగం పనిచేసిందని వారు ప్రశంసించారు. జాతర కు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తల్లుల దర్శనం కలిగించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.  జాతర చివరి రోజు పురస్కరించుకుని శనివారం మంత్రులు జిల్లా కలెక్టర్, ఎస్పిలతో కలిసి నేడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతు  జాతర విజయవంతానికి కృషి చేసిన పారిశుద్ధ్య, ఆరోగ్య, రవాణా, పోలీస్, రెవిన్యూ ఇతర శాఖల విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా పూజారులు, ఆదివాసుల సహకారం ఎనలేనిదన్నారు. రాత్రి పగలు కష్టపడి కవరేజ్ చేసిన మీడియా సేవలు మారువలేనిదని ఆయన తెలిపారు. 


గత జాతరలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని ఈసారి ఎటువంటి లోపానికి తావులేకుండా జాతర సక్రమంగా నిర్వహించమన్నారు. తల్లుల రాకకు ముందే దాదాపు 60లక్షల మంది భక్తులు మేడారనికి వచ్చారని జాతర సమయంలో 60 నుండి 70 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని తెలిపారు. ఈ ఏడాది దాదాపుగా కోటి 20 నుండి 35 లక్షల భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతర నిర్వహణకు వివిధ జిల్లాల నుండి 1200 మంది అధికారులు విధులు నిర్వహించారన్నారు. 900 మంది పరామెడికల్, పది వేలకు పైగా పోలీసులు,4000 మంది పారిశుధ్య కార్మికులు ఇలా అన్ని శాఖల నుండి అధికారులును కేయయించడం జరిగిందన్నారు. జాతర సందర్భంగా 6700  టెంపరరీ, 300 శాశ్వత మరుగుదొడ్లు నిర్మించామన్నారు. తల్లుల దీవెనతో కరోన తగ్గుముఖం పెట్టిందని, అమ్మవారి చలువతో ఇబ్బందులు కలగకుండా జాతర ముగించుకున్నామని ఆయన చెప్పారు. 


దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఆసియా ఖండం లోనే అతి పెద్ద జాతరను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్ట్లు చేసి విజయవంతగా పూర్తి చేసిందని తెలిపారు. త్వరలో పోలీస్ ఆర్టీసీ ఇతర ప్రధాన శాఖలకు శాశ్వత షెడ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ లోను భక్తుల దర్శనం లోను ఎటువంటి ఇబ్బంది కలగలేదని ఏ ఒక్క ఫిర్యాదు రాకుండా జాతరను పూర్తి చేశామన్నారు. తక్కువ సమయంలో దర్శనం కలగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారని అధికారులు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణాదిత్య మాట్లాడుతూ జాతర విజయవంతానికి  సహకరించిన అందరికి అభినందనలు తెలిపారు.


ముఖ్యంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తూ తోడ్పాటును అందించారని తెలిపారు.  ఆరు నెలల ముందు నుండే జాతర  పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేశామన్నారు. ముఖ్యంగా రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించామని తద్వారా  రవాణాకు ఎటువంటి అంతరాయం కలగలేదన్నారు. ఈ ఏడాది భక్తులు కూడా ఒక్కరోజు బస చేసి తల్లుల దర్శనం చేసుకొని వెళ్లారని అన్నారు. ఈ మేరకు కొంత రద్దీ తగ్గిందన్నారు. పార్కింగ్ స్థలాల పైన ప్రత్యేక శ్రద్ధ వహించామని ఎంట్రీ ఎక్సిట్ గేట్స్ పెట్టడం వలన ట్రాఫిక్ సమస్య కలగలేదన్నారు. జాతరకు ముందె అధిక సంఖ్యలో భక్తులు మేడారనికి వచ్చారని ఒక్క గత ఆదివారమే 3 ను ఫై 5 లక్షల మంది దర్శనం చేసుకున్నారన్నారు.  జాతరకు రెండు వారాల ముందు నుండే వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2022-02-19T22:24:42+05:30 IST