గాంధీ ఘటనలో నిందితులపై కఠిన చర్యలుతీసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-18T20:37:08+05:30 IST

గాంధీ ఆస్పత్రి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖమంత్రి మహమూద్అలీ, ఎక్సైజ్ శాఖమంత్రి ఎనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

గాంధీ ఘటనలో నిందితులపై కఠిన చర్యలుతీసుకోవాలి

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖమంత్రి మహమూద్అలీ, ఎక్సైజ్ శాఖమంత్రి  ఎనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి మహమూద్ అలీ ,శ్రీనివాస గౌడ్ లు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కమీషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమీషనర్ శీఖా గోయల్ ,డిసిపి కల్మేశ్వర్, గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.


మహిళల భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మంత్రులు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని,వేగంగా పరిష్కరించాలని, చట్ట పరంగా పకడ్బందిగా చర్యలు చేపట్టాలని మంత్రులు పొలిసు అధికారులను ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని  త్వరలో పట్టుకుంటామని పోలీసు కమీషనర్ ఈ సందర్భంగా అన్నారు. 

Updated Date - 2021-08-18T20:37:08+05:30 IST