హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్స్, అదనపు కలెక్టర్స్‌తో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య శాఖ అధికారులతో కూడా మంత్రులు సమీక్ష జరుపనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. జిల్లాల వారీగా కోవిడ్ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీపై మంత్రులు సమీక్ష జరిపి తగు సూచనలు ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి