చిత్తూరు : రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్ శుక్ర, శనివారాల్లో జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మంత్రి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి బయల్దేరి పద్మావతి అతిథిగృహానికెళ్లి బస చేస్తారు. కొంత విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకుని, రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 11.30 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతి విమాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాదుకు వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.