తప్పును ఒప్పుకుని లెంపలు వేసుకోండి కన్నాగారూ: వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-05-26T22:05:13+05:30 IST

విజయవాడ: తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకోండంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

తప్పును ఒప్పుకుని లెంపలు వేసుకోండి కన్నాగారూ: వెల్లంపల్లి

విజయవాడ: తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకోండంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మీ పార్టీ నిర్ణయాన్ని తమ ప్రభుత్వానికి అంట కట్టవద్దన్నారు. తప్పు.. ఎప్పుడు.. ఎక్కడ జరిగిందో పూర్తి ఆధారాలతో బయట పెట్టింది.. వైసీపీ ప్రభుత్వమేనన్నారు. ఆనాడు తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ పార్టీ నేతలకు చెంప దెబ్బలు వేస్తారో... లేదంటే మీరే లెంపలు వేసుకుంటారో మీ ఇష్టమని వెల్లంపల్లి పేర్కొన్నారు. 


మీ పార్టీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలో, మీ పార్టీ సభ్యుడు టీటీడీ సబ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని, మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం సూచించిందన్నారు.

Updated Date - 2020-05-26T22:05:13+05:30 IST