Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజల ముంగిట్లోకే వైద్యం బస్తీదవాఖానాలు: తలసాని

హైదరాబాద్: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్న ధ్యేయంతోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బస్తీదవాఖానాల ఏర్పాటుతో పేదల ముంగిట్లోకే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. శుక్రవారం గోషా మహల్ నియోజకవర్గ పరిధిలోని ధూల్ పేట లో గల చంద్ర కిరణ్ బస్తీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి ప్రారంభించారు. 


ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఆలోచనతో జీహెచ్ఎంసి పరిధిలో పెద్ద సంఖ్యలో బస్తీ దవాఖానాలను  ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి.శుక్రకవారం ఒక్క రోజూ నూతనంగా మరో  32 బస్తీ దవాఖానా లను ప్రారంభించినట్టు తెలిపారు. ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తున్న బస్తీ దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Advertisement
Advertisement