పునీత్ రాజ్ కుమార్ మృతి చాలా బాధాకరం: తలసాని

ABN , First Publish Date - 2021-10-29T21:27:33+05:30 IST

కన్నడ పవర్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ మృతి చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.

పునీత్ రాజ్ కుమార్ మృతి చాలా బాధాకరం: తలసాని

హైదరాబాద్: కన్నడ పవర్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ మృతి చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.నటుడిగా, సింగర్ గా, ప్రొడ్యూసర్ గా తన సమర్థతను చాటుకున్నారు.పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయని, ఆయన తెలుగు వారికి కూడా పరిచయమేనని అన్నారు.పునీత్ కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Updated Date - 2021-10-29T21:27:33+05:30 IST