ప్రతి నియోజక వర్గంలో మనబస్తీ-మనబడి పనులు ప్రారంభం: తలసాని

ABN , First Publish Date - 2022-05-02T20:04:59+05:30 IST

ఈ నెల 9న హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మన బస్తి –మన బడి పనుల ప్రారంభం అవుతాయని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ప్రతి నియోజక వర్గంలో మనబస్తీ-మనబడి పనులు ప్రారంభం: తలసాని

హైదరాబాద్: ఈ నెల 9న హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మన బస్తి –మన బడి పనుల ప్రారంభం అవుతాయని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మన బస్తి – మన బడి కార్యక్రమం అమలుపై హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా   ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి 7,289.54 కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పారు.హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతగా 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. 


గత ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ వచ్చిందన్నారు.రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయని చెప్పారు.పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధుల కోసం నియోజకవర్గం కు ఒకటి చొప్పున ఉచిత కోచింగ్ సెంటర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తలసాని తెలిపారు.ఉచిత కోచింగ్ తోపాటు ప్రతి అభ్యర్ధికి నెలకు 5 వేల రూపాయలు చొప్పున స్టయిఫండ్ చెల్లింపు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-02T20:04:59+05:30 IST