సాంస్కృతిక సారథి కళాకారుల జీతం పెంపు:మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-03-12T02:15:25+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కళాకారులు కీలకపాత్ర పోషించారని పర్యాటక, సాంస్క`తిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

సాంస్కృతిక సారథి కళాకారుల జీతం పెంపు:మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కళాకారులు కీలకపాత్ర  పోషించారని పర్యాటక, సాంస్క`తిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారులు గ్రామగ్రామాన ప్రజలకు అర్థమయ్యేలా తమ ఆటపాటలతో వివరించాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ తో పాటు దేశానికే వెన్నుముక - తెలంగాణ రైతు పాట సీడీ లను సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ లతో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  కళాకారుల కు అందిస్తున్న వేతనాల ను 30 శాతం  పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసి రాష్ట్రాన్ని సాధించడం లో ప్రముఖ పాత్ర పోషించిన కళాకారులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్క ళాకారుల కు ఏది అడిగినా కాదనరన్నారు.సారధి కళాకారులు గ్రామాలలో ప్రదర్శనలు ఇచ్చేందుకు వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమస్య ను పరిష్కరించెందుకు జిల్లాకు ఒక వాహనాన్ని సమకూర్చుతున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు సౌకర్యంతో పాటు వారిచ్చే ప్రదర్శనలు ప్రజలకు ఆకట్టుకునే విధంగా మంచి సౌండ్ సిస్టం ఉండేవిధంగా ప్రతి జిల్లాకు సౌండ్ సిస్టం అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-12T02:15:25+05:30 IST