Abn logo
Sep 18 2021 @ 16:29PM

సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: రాష్ట్రంలో గౌడ,ఎస్సీ,ఎస్టీ  కులస్తులకు వైన్ షాప్ లలో రిజర్వేషన్లు ను కల్పించి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో కేసీఆర్ తీసుకున్ననిర్ణయం పై గౌడ కుల సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో కల్లు దుకాణాలు తెరిపించి గౌడ ఆత్మగౌరవాన్ని నిలిపారు. కల్లును గౌడ్ మాత్రమే ఉత్పత్తి చేసేలా జీవో తీసుకొచ్చారని అన్నారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వృత్తి పన్ను రద్దు చేసి ఉచితంగా గీత కార్మికులకు లైసెన్సులు జారీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసీఆర్ కు కులవృత్తులు అంటే ఎంతో అభిమానం. కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సంకల్పంతో చిన్న చిన్న కుల వృత్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో దళిత బంధు తీసుకువచ్చారు. అందులో భాగంగా వైన్ షాప్ లలో దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం వాటా  గౌడ్ లకి 15 శాతం వాటాను కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. 


గత ప్రభుత్వాలు కులవృత్తులను నాశనం చేశాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు కుల వృత్తుల అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నార అన్నారు. గతంలో బార్లు వైన్ షాపులు, కల్లు దుకాణాలు గౌడ్ లు మాత్రమే నిర్వహించే వారని తెలిపారు. కుల వృత్తులను కొందరు నాశనం చేశారని ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు గౌడ్ లకు 15 శాతం వైన్ షాప్ లలో వాటా కల్పించాలని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...