కేబినెట్‌ మీటింగ్‌లో బిల్ట్‌పై చర్చిస్తాం

ABN , First Publish Date - 2021-09-16T05:27:03+05:30 IST

కేబినెట్‌ మీటింగ్‌లో బిల్ట్‌పై చర్చిస్తాం

కేబినెట్‌ మీటింగ్‌లో బిల్ట్‌పై చర్చిస్తాం
మంత్రి సత్యవతికి వినతిపత్రం అందజేస్తున్న బిల్ట్‌ కార్మికులు

కార్మికులకు మంత్రి సత్యవతి

ములుగు, సెప్టెంబరు 15: బిల్ట్‌ ఫ్యాక్టరీ సమస్యను కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించి కార్మికులకు న్యాయం చేస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.   బిల్ట్‌ ఫ్యాక్టరీకి చెందిన పలువురు కార్మికులు మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో మంత్రిని బుధవారం కలిశారు. తమ సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందజేశారు. 73 నెలలుగా వేతనాలు లేక కష్టాలు పడుతున్నామని, యాజమాన్య వైఖరితో తమ జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన చెందారు. బిల్ట్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై మంత్రి స్పందిస్తూ శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-09-16T05:27:03+05:30 IST