Abn logo
Oct 12 2021 @ 23:46PM

మెరుగైన వైద్య సేవల కోసం మెడికల్‌ కళాశాల

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కృషి

అర్హులైన గిరిజన రైతులకు న్యాయం చేస్తాం

పోడు రైతుల జోలికి అధికారులు వెళ్లొద్దు 

మంత్రి సత్యవతిరాథోడ్‌ 

మహబూబాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే తెలంగాణ సర్కార్‌ లక్ష్యమని చెప్పారు. జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడారు. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, దానిని అధిగమించేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గిరిజన జిల్లా మానుకోటతో పాటు ములుగు, జయశంకర్‌జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆక్సోఫామ్‌ ప్రతినిధులను అభినందించారు. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే 57 రకాల వైద్య పరీక్షలు చేసేందుకు టీ-హాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింద న్నారు. 

మెరుగైన వైద్య సేవలు..

పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాకు సీఎం కేసీఆర్‌ మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారని మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని జిల్లా ప్రజల తరుపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మెడికల్‌ కళాశాల కోసం 30 ఎకరాల స్థలం అధికారులు కేటాయించారని, అందులో అర్హులైన గిరిజన రైతులకు నష్టం జరిగితే న్యాయం చేస్తామని ప్రకటించారు. మెడికల్‌ కళాశాలకు అడ్డుపడితే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పారు.   

సర్కార్‌ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం  : ఎంపీ కవిత

సర్కార్‌ ఆస్పత్రులను ఆధునీకరించి పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని ఎంపీ మాలోతు కవిత అన్నారు. కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ.... కొవిడ్‌ సమయంలో వైద్యాధికారులు, సిబ్బంది సేవలు అనీర్వచనమని, మున్ముందు కూడా అదే స్థాయిలో వైద్య సేవలందించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, వైస్‌చైర్మన్‌ ఎండీ. ఫరీద్‌, డీఎంహెచ్‌వో హరీ్‌షరాజ్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.వెంకట్రాములు, ఆక్సోఫామ్‌ ప్రతినిధి సత్యప్రకా్‌షమిశ్రా, పర్కాల శ్రీనివా్‌సరెడ్డి, ముత్యం వెంకన్న, బూర్ల ప్రభాకర్‌గౌడ్‌, కౌన్సిలర్లు బోనగిరి గోపిరత్నం, చిట్యాల జనార్దన్‌, వైద్యులు చంద్రశేఖర్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.