ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే టీచర్స్ రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా

ABN , First Publish Date - 2022-01-20T02:59:40+05:30 IST

రాష్ట్రంలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే టీచర్స్ రిక్రూట్‌మెంట్

ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే టీచర్స్ రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా

హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే టీచర్స్ రిక్రూట్‌మెంట్ జరుగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తెలిపారు. నగరంలో మీడియాతో మంత్రి  చిట్ చాట్ నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచే 10 వ వతరగతి  వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుందన్నారు. సగం మంది టీచర్లకు ఇంగ్లీష్‌లో బోధించే పరిజ్ఞానం ఉందని మంత్రి పేర్కొన్నారు. మిగతా 50 శాతం టీచర్లకు సైతం ఆంగ్ల భాషపై పట్టు కోసం ట్రైనింగ్ ఇస్తామన్నారు. త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందన్నారు. టీచర్లు లేరని ప్రతిపక్షాలు రాజకీయం మాట్లాడుతున్నాయని ఆమె ఆరోపించారు.  ప్రస్తుతం రాష్ట్రం లో 10 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లీష్ చదువుతున్నారని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో ఇంగ్లీష్, తెలుగు మీడియంలు రెండూ ఉంటాయన్నారు.


రాష్ట్రంలో కేసులు తగ్గితేనే స్కూళ్లు తెరుస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 30 లోపు కేసులు తగ్గుముఖం పడతాయని వైద్యులు చెప్తున్నారని ఆమె పేర్కొన్నారు. జీఓ317 పై ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుందన్నారు. త్వరలోనే సీఎంతో ఉపాధ్యాయుల అంశంపై చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద నాలుగు స్కూళ్లు మోడల్ స్కూళ్లు ఎంపిక చేశామని  మంత్రి సబితా తెలిపారు.  


Updated Date - 2022-01-20T02:59:40+05:30 IST