త్వరలో 93 కోట్ల చేప పిల్లలను వదులుతాం: మంత్రి సబితా

ABN , First Publish Date - 2021-09-08T22:02:19+05:30 IST

త్వరలో చెరువులు, రిజర్వాయర్లలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని

త్వరలో 93 కోట్ల చేప పిల్లలను వదులుతాం: మంత్రి సబితా

వికారాబాద్: త్వరలో చెరువులు, రిజర్వాయర్లలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో ఐదో విడత చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని మంత్రి సబితా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 89 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. త్వరలో చెరువులు, రిజర్వాయర్లలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. 10 కోట్ల రొయ్య పిల్లలను 200 నీటి వనరుల్లో విడుదల చేస్తామని సబితారెడ్డి పేర్కొన్నారు.




జిల్లాలో 447 మందికి కోటి 40 లక్షల రుణాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలో 105 మృత్స పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 4,429 మంది సభ్యులు ఉన్నారన్నారు. అలాగే జిల్లాలో 775 చెరువులు ఉన్నాయని పేర్కొన్నారు. 100 శాతం రాయితీ పై రిజర్వాయర్లు, ప్రాజెక్ట్‌లు, చెరువులలో చేప పిల్లలను వదులుతున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 79.33 లక్షల చేప పిల్లలను ఒక చేపకు 47 పైసల చొప్పున 34 లక్షల 22 వేలు వెచ్చించి చెరువుల్లో వదలడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కాలే యాదయ్య, కలెక్టర్ నిఖిల, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-08T22:02:19+05:30 IST