Minister sabita reddy కార్యాలయ ముట్టికి వాపమక్ష విద్యార్థుల యత్నం

ABN , First Publish Date - 2022-07-20T18:06:03+05:30 IST

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు యత్నించాయి.

Minister sabita reddy కార్యాలయ ముట్టికి వాపమక్ష విద్యార్థుల యత్నం

హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita indrareddy) కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు యత్నించాయి. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌కు వామపక్ష విద్యార్థులు పిలుపునిచ్చాయి. బంద్‌లో భాగంగా విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తక్షణమే పెండింగ్ పాఠ్యపుస్తకాలు, యునిఫామ్స్ అందించాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలన్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలన్నారు. విద్యార్ధులందరికి ఉచిత బస్ పాస్ అందించాలని పట్టుబట్టారు. మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. ప్రైవేట్, కార్పోరేట్ ఫీజుల నియంత్రణకై ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకుని రావాలని, విద్యారంగంలో ఖాళీగా ఉన్న అన్ని అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని వామపక్ష విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా ముట్టడికి వచ్చిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-07-20T18:06:03+05:30 IST