రుయా ఆస్పత్రి ఘ‌ట‌న‌పై మంత్రి ర‌జిని ఆగ్ర‌హం

ABN , First Publish Date - 2022-04-27T03:04:13+05:30 IST

రుయా ఆస్పత్రి ఘ‌ట‌న‌పై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు..

రుయా ఆస్పత్రి ఘ‌ట‌న‌పై మంత్రి ర‌జిని ఆగ్ర‌హం

తిరుప‌తి: రుయా ఆస్పత్రి  ఘ‌ట‌న‌పై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన రుయా ఆస్పత్రి సూప‌రింటెండెంట్‌ డాక్టర్ భార‌తికి షోకాజ్‌ నోటీసు, ఆర్ఎంవోని సస్పెన్ష‌న్‌ చేస్తూ మంత్రి రజిని ఆదేశాలిచ్చారు. మంగ‌ళ‌గిరి, ఏపీఐఐసీ బిల్డింగ్‌లోని మంత్రి కార్యాలయం నుంచి మంత్రి రజని తెలిపారు. ఈ ఘటనపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..‘‘ మ‌హా ప్ర‌స్థానం వాహ‌నాలు రాత్రిళ్లు కూడా ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ప్రీపెయిడ్ ట్యాక్సీల విష‌యాన్ని ప‌రిశీలిస్తాం. ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో మెరుగైన సేవ‌ల్ని అందించాల‌నే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో  ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. రుయా ఘ‌ట‌నను ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.ఈఘటనలో  ఇంకా బాధ్యులెవ‌రున్నారన్నది పూర్తి స్థాయి విచార‌ణ త‌ర్వాత తెలుస్తుంది. బాధ్యులంద‌రిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.ఈ ఘ‌ట‌న అత్యంత అమాన‌వీయ‌ం. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూస్తాం. పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఉన్నతాధికారుల‌కు ఆదేశించాం. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎవ‌రైనా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం. పోలీసు శాఖ త‌ర‌ఫున కూడా చ‌ర్య‌లు తీసుకుంటాం’’ అని మంత్రి రజని వెల్లడించారు. 

Updated Date - 2022-04-27T03:04:13+05:30 IST