సాగర్‌ ఆయుకట్టు భూములకు పాలేరు జలాలు విడుదల

ABN , First Publish Date - 2020-08-13T20:24:10+05:30 IST

జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్‌ ఆయుకట్టు భూములకు సాగునీటిని పాలేరు రిజర్వాయర్‌ నుంచి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విడుదల చేశారు.

సాగర్‌ ఆయుకట్టు భూములకు పాలేరు జలాలు విడుదల

ఖమ్మం: జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్‌ ఆయుకట్టు భూములకు సాగునీటిని పాలేరు రిజర్వాయర్‌ నుంచి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విడుదల చేశారు. శ్రీవైలం జలాశయం నిండిన వెంటనే నాగార్జున సాగర్‌ జలాశయానికి నీటిని విడుదల చేయాలని ఇప్పటికే 225 టీఎంసీల నీటి నిల్వ సాగర్‌జలాశాయంలో ఉన్నందున ఖమ్మం జిల్లాకు సాగునీటిని ఇవ్వాలని మంత్రి పువ్వాడ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటల సాగుకు 24.611టీఎంసీలు కేటాయించాలని ఇటీవల జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశంలో మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సాగర్‌ ఆయకట్టుకు ముందుగానే సాగునీటిని విడుదల చేసినట్టు తెలిపారు. 


ఆయయట్టులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్‌ సీజన్‌లో నీటిని అందించాలని మంత్రి పేర్కొన్నారు. సెప్టెంబరు 3వ తేదీ వరకూ నిరాటంకంగా 23 రోజులు ఆయకట్టుకు నీరు సరఫరా చేస్తారని ఆ తర్వాత ఆరు రోజులు సరఫరా ఆపి మళ్లీ 9 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. ఈ విధంగా అవసరం మేరకు నీటి తడులు అందిస్తామన్నారు. వ్యవపాయ పనులు ముమ్మరం అవుతున్నందున కావాల్సిన ఎరువులు సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే అధికారులకు తగు సూచనలు చేసినట్టు మంత్రి వెల్లడించారు. 

Updated Date - 2020-08-13T20:24:10+05:30 IST