కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం- మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2020-04-06T00:10:00+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రబలకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం- మంత్రి పువ్వాడ

ఖమ్మం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రబలకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుని సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను తరిమివేయవచ్చన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్స్‌ను పంపిణీ చేశారు. కరోనాను ఎదుర్కొనడానికి అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 200 పీపీఈ కిట్స్‌ అందుబాటులో ఉండగా రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో మాట్లాడి అదనంగా మరో 1000 కిట్స్‌ తెప్పించామన్నారు. కరోనా నివారణ చర్యలకు అవసరమయ్యే బెడ్స్‌, ఐసీయూ, సిబ్బంది తదితర సదుపాయాలు అన్నిపరికరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 

Updated Date - 2020-04-06T00:10:00+05:30 IST